సార్వత్రిక ఎన్నికలకు ఇక ఐదు నెలలే సమయం ఉన్నందున కురుక్షేత్ర సంగ్రామానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. చంద్రబాబును జైల్లో పెట్టి, ఎన్నికల్లో గెలిచేయాలనుకుంటున్న జగన్రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు సంసిద్ధం కావాలన్నారు. ‘పిచ్చి జగన్.. చంద్రబాబును అరెస్టు చేయించాడు. అక్రమ అరెస్టులు చేయగలరేమో గానీ తెలుగు ప్రజల హృదయం నుంచి ఆయన్ను తొలగించలేడు’ అని అన్నారు.