అధికారంలో ఉంటే క్యాష్..ఆ తర్వాత క్వాష్..ఇదీ తెలుగు దేశం పార్టీ తీరని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. చంద్రబాబు నిజాయితీపరుడంటూ కబుర్లు చెబుతున్నారు. ఆవు దూడ మీద, దూడ ఆవు మీద చెప్పినట్టు బాబు, లోకేశ్ ప్రవర్తన ఉందన్నారు. తన ఆస్తులపై సీబీఐ విచారణ కోరే దుమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ మంత్రి సవాల్ విసిరారు. చంద్రబాబు అరెస్టును ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆయనకు ఎవరైనా మద్దతుగా నిలబడ్డారా?. చంద్రబాబు పెత్తందారుల వైపు నిలబడినందుకే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయింది. సీఎం వైయస్ జగన్ పరిపాలన ఒక సువర్ణయుగంగా ఉందని ప్రజలే చెబుతున్నారని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.