విద్యావ్యవస్థలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను డిస్మిస్ చేసింది. ప్రభుత్వం సుప్రీం కోర్టు వరకువెళ్లగా బెస్ట్ అవైలబుల్ స్కీం కొనసాగిస్తూ జీవో ఇచ్చింది. ప్రస్తుతం ఈ స్కీమ్ లో ప్రైవేట్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులను కొనసాగిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టులో ఈ అంశంపై విద్యార్థిని విద్యార్థుల తరపున న్యాయవాది ముతుకిమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌ను కొనసాగిస్తున్నట్లు సోషల్ వెల్ఫేర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి జీవో నెం. 61ను జారీ చేశారు.