మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో పలు కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ నారా లోకేశ్ ప్రకటించారు.వీటిలో భాగంగా నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టు విషయం తెలిసి మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారానికి రెండు మూడు నియోజకవర్గాల్లో ఆమె పర్యటన ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమంతో భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారనే చెప్పాలి.