గుంటూరు జిల్లా, మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అధికార ప్రతినిధులతో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ.... రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. మన పార్టీ కమ్యూనిస్టులతో, బీజేపీతో, టీడీపీతో ఏ పార్టీతో పొత్తులో ఉన్నా అది రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసికెళ్ళాలి. ఏ రాజకీయ పార్టీకీ, ఏ నాయకుడికీ నేను వ్యతిరేకం కాదు. వ్యక్తిగతంగా వారు నన్ను దూషించినా శత్రువుగా పరిగణించను. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరిని ఎప్పుడు కలవాల్సి వస్తుందో చెప్పలేం. ఒక్కొక్కసారి మన ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని కూడా కలవాల్సిన సందర్భాలు రావచ్చు. అందువల్ల మంచిగా పలకరించుకునే వాతావరణం ఉండాలి’ అని పేర్కొన్నారు.