కర్నూలు జిల్లా, కల్లూరులో దారుణం జరిగింది.వివరాల్లోకి వెళ్ళితే..... డోన్ మండలం కొత్తపల్లి చెందిన రేష్మాకు గత ఏడాది వివాహం జరిగింది. రూ. 4 లక్షల నగదు, 20 తులాల బంగారు కట్నంగా ఇచ్చి రేష్మకు పెళ్లి జరిపించారు. కానీ భర్త రహంతుల్లా, అత్త, మామ వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులకు రేష్మ మొర పెట్టుకుంది. ఇంతలోనే రేష్మ సెవమై మిగిలింది. అదనపు కట్నం తీసుకురాలేదని అత్త, మామ రేష్మను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యపై బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.