నేడు కర్నూలు జిల్లా, దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం ప్రారంభమైనది. అయితే ఈ ఉత్సవంలో కర్రల సమరంలో హింసను నివారించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులు దేవరగట్టుకు కర్రలు తీసుకెళ్లకుండా ఆలయం చుట్టు పక్కల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వెయ్యి మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిధిలో నైట్ విజన్ సీసీ కెమెరాలు, ఎల్ఈడీ లైట్లు, డ్రోన్స్, వీడియో కెమెరాలతో నిఘా పెట్టినట్లు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు.