టీడీపీ యువనేత నారా లోకేశ్, సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తపరిచారు. పార్టీ ముఖ్యనేతల సమావేశంలో అయన మాట్లాడుతూ.... జగన్ చూపు పడితే పచ్చని పంట పొలాలు ఎండిపోతాయి. అడుగుపెడితే నిండుగా ఉన్న డ్యాముల గేట్లు కొట్టుకుపోయి ఖాళీ అయిపోతాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కరవుకి బ్రాండ్ అంబాసిడర్, దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ జగన్ అని అన్నారు. ఒక్క చాన్స్ ఇచ్చిన పాపానికి వరి వేసిన రైతుకి ఉరి, పంటలు వేసిన అన్నదాతలకు మిగిలింది గుండె మంటలు. ఎండిన పంట చూసి ఆందోళనతో చేలోనే ఉరి వేసుకుంటామంటోన్న రైతుల గోడు వినపడదా!, అని ప్రశ్నించారు.