టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకి నిరసనగా సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలుపై పుంగనూరులో జరిగిన ఘటనని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..... ఇది ఏమైనా మీ ప్రత్యేక రాజ్యమని అనుకుంటున్నారా?, ఉత్తరాంధ్రవాసులు శాంతియుతంగా యాత్ర చేస్తే అవమాన పరుస్తారా? సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితులు. ఇటువంటి దుర్మార్గ చర్యలను పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాలి. మానవ హక్కులు కమిషన్ కూడా సుమోటోగా తీసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.