కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కలిసి రాష్ట్ర ఆర్థిక స్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలు, చేసిన అప్పులు 10.77 లక్షల కోట్లు అంశాలు మీ దృష్టికి తేవడం జరిగిందని తెలిపారు. ఆర్బీఐకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన 4.42 లక్షల కోట్ల రూపాయల అప్పులను మాత్రమే చెప్పి.. రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్లతో సహా చేసిన ఇతర అప్పులను చెప్పలేదని పురందేశ్వరి పేర్కొన్నారు. అన్ని రకాల సావనీర్ గ్యారంటీలను, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను ఏఫ్ఆర్భీఏం పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నామని పురందేశ్వరి పేర్కొన్నారు.