చంద్రబాబు అరెస్ట్ అయిన మొదటి వారంలో రెండు లక్షల 44 వేల 851 టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించడానికి form-7 పెట్టారు. అదే వారంలో కొత్త ఓటర్ల కోసం లక్ష 20 వేల పైగా దరఖాస్తులు వచ్చాయి అని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వ్యాఖ్యానించారు. సుమారు 20 నియోజకవర్గాలను టార్గెట్ చేసి ఓట్ల తొలగింపునకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒక్క పర్చూరు నియోజకవర్గంలో 14 వేల ఓట్లు తొలగించడానికి form- 7 పెట్టారు. హైకోర్టు ఆదేశాలతో పర్చూరులో కంటితుడుపు చర్యలు చేపట్టారు. కొందరు పోలీసు అధికారులు ఓట్ల తొలగింపు కోసం BLO లపై ఒత్తిడి చేస్తున్నారు అని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.