నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై ఈ నెల 21వ తేదీ డీజీపీకి లేఖ రాస్తూ .... యాత్రకు సెక్యూరిటి కల్పించాలి అని లేఖలో పేర్కొన్నాం. కానీ డీజీపీ మాత్రం యాత్ర గురించి తెలియదు అని చెప్పడం సిగ్గుచేటు అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. మానవహక్కుల ఉల్లంఘనలో ఏపీ బీహార్లా మారింది. వెంటనే డీజీపీ.. నారా భువనేశ్వరి యాత్రకు రక్షణ కల్పించాలి. నిజం గెలిస్తే జగన్ శాశ్వతంగా జైల్లో ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి అని వర్ల రామయ్య తెలియజేసారు.