ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వచ్చమైన పాలన కోసం చంద్రబాబు రావాలి.... కనకమేడల రవీంద్ర కుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 24, 2023, 08:55 PM

రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఆయన ఇవాళ అవనిగడ్డ వచ్చారు. ఇక్కడి లంకమ్మ తల్లి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కనకమేడల మీడియాతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలోకెల్లా ప్రముఖ అవినీతి రాజకీయనేత ఎవరన్నా, అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరన్నా... జాతీయ మీడియా సీఎం జగన్ పేరే చెబుతోందని... అందుకే చంద్రబాబుపై బురద చల్లడానికి అక్రమ కేసుతో అరెస్ట్ చేయించారని కనకమేడల ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం జగన్ తీసుకువచ్చే ప్రతి స్కీము ఒక స్కాం అని విమర్శించారు. రాష్ట్ర ఆదాయంలో 60 శాతం ఎటు వెళుతుందో చెప్పాలని నిలదీశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com