వాయవ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుఫాన్ ఈశాన్యం దిశగా కదులుతూ బలహీన పడి తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా మారుతుందని.. బుధవారం ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. మరోవైపు ఏపీలో ఎండల ప్రభావం కొనసాగుతోంది. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.