రైతులకు పంట సాయం కింద పీఎం కిసాన్ పేరుతో కేంద్రం ఏటా ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ICRIER) సంస్థ కేంద్రానికి ఓ నివేదిక సమర్పించింది. రైతులకు ఆర్థిక సాయం రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని సూచించింది. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే నవంబర్లో పెరిగిన మొత్తంతో కూడిన 15 విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది.