ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో పర్యాటక ప్రాంతాలు సందడిగా మారాయి. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో మంచు మేఘాలు ఆ ప్రాంతాలను అందంగా మార్చేశాయి. వనజంగి వ్యూ పాయింట్, లంబసింగి ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. వనజంగి వ్యూపాయింట్ నుంచి కిందకు చూసినప్పుడు ఆ ప్రాంతమంతా మేఘాల దుప్పటి పరుచుకున్నట్టు వాతావరణం కనిపిస్తోంది. దీంతో పర్యాటకులు సందడి చేస్తున్నారు.