వ్యవసాయ కూలీలకు కిడ్నీ వ్యాధులు సంభవించడానికి, ఇతర కారణాలతో పాటు మరో కారణం కనిపిస్తున్నది. చెరుకు తోట, వరి చేలలోని ఊక, దుబ్బులు, వ్యర్థపదార్థాలను కాల్చడం వల్ల వచ్చే గాలి అనేది కిడ్నీ వ్యాధులకు దారి తీస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. భారతదేశం, శ్రీలంక, అమెరికా దేశాల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చ్ బృందం తెలిపారు.