టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకి నిరసనగా ఈ నెల 23వ తేదీన (సోమవారం) టీడీపీ గుంటూరు జిల్లా కార్యాలయం వద్ద జరిగిన ‘జగనాసుర దహనం’లో పాల్గొన్న టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనం చేసిన వారిపై అరండల్ పేట పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు అంతం కావాలని, సైకో పోవాలని సోమవారం రాత్రి ముమ్మిడివరం పోలమ్మ చెరువుగట్టున ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ అధ్యక్షుడు తాడి నరసింహారావు ఆధ్వర్యంలో జగనాసుర దహన కార్యక్రమం నిర్వహించారు. కరపత్రాలను దహనం చేసి సీఎం జగన్కు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.