చైనాలో మంత్రుల తొలగింపు చర్యలు జరుగుతున్నాయి. ఇప్పటికే రక్షణ మంత్రిని తొలగించిన డ్రాగన్ ప్రభుత్వం. తాజాగా మరో ఇద్దరు మంత్రులను తొలగించింది. 2 నెలలుగా కనిపించకుండా పోయిన రక్షణ మంత్రి లీ షాంగ్ఫూను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్థిక మంత్రి లియు కున్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వాంగ్ జిగాంగ్లను తొలగించింది. వారి స్థానంలో ఆర్థిక మంత్రిగా లాన్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా హెజున్ను నియమించింది.