విశాఖ నుంచి విజయవాడకు ఆటోలో వాషింగ్ మిషన్లలో అక్రమంగా తరలిస్తున్నసుమారు రూ. 1.3 కోట్ల నగదును తరలిస్తుండగా ఎన్ఏడి జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న విశాఖ పోలీసులు పట్టుకున్నారు. హవాలా నగదుగా అనుమానిస్తున్నారు. పట్టుబడిన నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.