ఇజ్రాయెల్ దాడులతో అల్లాడుతున్న గాజాకు ఆహార పదార్థాలు, వైద్య పరికరాలను భారత్ అందించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ‘పాలస్తీనాతో సహా మధ్యప్రాచ్యంలో పరిస్థితి’ అనే అంశంపై జరిగిన చర్చలో భారత్ తరపున యునైటెడ్ నేషన్ డిప్యూటీ పర్మినెంట్ రిప్రజెంటివ్ ఆర్ రవీంద్ర ప్రాతినిధ్యం వహించి మాట్లాడారు. ఈ మేరకు గాజా స్ట్రిప్‌కు సాయంగా భారత్ తరపున 38 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలను పంపినట్లు తెలిపారు.