ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో పాటు డీఎంకే నేతలకు ఓటమి భయం పట్టుకుందని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి పేర్కొన్నారు. నకిలీ ఓటర్లను తొలగించే విషయంపై స్టాలిన్ చేస్తున్న ప్రసంగాల్లో తనకు ఎలాంటి ఆక్షేపణ లేదన్నారు. స్టాలిన్ ఎక్కడకు వెళ్ళిన తనను విమర్శిస్తూన్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికలు రాకముందే డీఎంకే నేతలు భయపడుతున్నారని ఎడప్పాడి తెలిపారు.