చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని అయన తనయుడు నారా లోకేష్ నవంబర్ ఒకటోవ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్థానంలో జనంలోకి వెళ్లనున్నారు. పార్టీ కార్యక్రమాలు, నిర్వహణపై ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలతో లోకేష్ చర్చించి ప్రణాళిక రూపొందించారు.