గిరిజన మహిళలపై దాడికి పాల్పడిన రాజాచంద్, ఆయన సోదరి రాధిక, సచివాలయం మహిళా కానిస్టేబుల్, ఎస్ఐలపై తక్షణ చర్యలు తీసుకోవాలని టీడీపీ కృష్ణాజిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ డిమాండ్ చేశారు. గాయపడిన మహిళలను పరామర్శించిన అనంతరం ఆసుపత్రి వద్ద టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాచవరపు ఆదినారాయణ మాట్లాడుతూ..... , ఎస్సీలకు అండగా ఉంటానని చెబుతున్న సీఎం జగన్, పార్టీ నాయకులే దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు తక్షణ చర్యలు తీసుకోకుండా వైసీపీ నాయకులకు వత్తాసు పలకడం ఆశ్చర్యమన్నారు. మాజీ జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, తెలుగు మహిళలు లంకిశెట్టి నీరజ, కరెడ్ల సుశీల, ఎన్.వసంత తదితరులు పాల్గొన్నారు.