బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయాలని బిఎస్పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరాములు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం హిందూపురం పట్టణంలో బహుజనులకు రాజ్యాధికారం బిఎస్పీ తోనే సాధ్యం" అనే నినాదంతో బిఎస్పి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అగ్రకులాల్లోని పేదలు బిఎస్పి లో చేరి రాజ్యాధికారం పొందాలన్నారు.