గుంతకల్లు పట్టణ పరిధిలోని దోనిముక్కల రోడ్డు ప్రాంతంలో గత ప్రభుత్వాలు పేద ప్రజలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను కొందరు స్వార్థరులు ఆక్రమణలు చేశారని వాటిపై న్యాయ విచారణ జరిపించాలని నేషనల్ హ్యుమన్ రైట్స్ అండ్ మీడియా ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ ఆలం నవాజ్ కోరారు. ఈ మేరకు గురువారం తహశీల్దార్ ప్రతాప్ రెడ్డిని కలసి వినతి పత్రాన్ని అందజేశారు. పేదల ఇళ్ల స్థలాల ఆక్రమణలపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు.