జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ వన్నూర్ బీ పేర్కొన్నారు. గురువారం గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 10వ సచివాలయం ప్రాంగణంలో 7, 8, 25 వార్డుల ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, ప్రోగ్రాం ఆఫీసర్ చెన్నకేశవులు, వైద్యులు బిందు భార్గవి, దివ్య తదితరులు పాల్గొన్నారు.