విశాఖ రుషికొండలోని రాడిసిన్ హోటల్లో జలవనరుల సంరక్షణపై నవంబరు 2 నుంచి 8 వరకు అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో కలిసి సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు 90 దేశాల నుంచి గెస్ట్ లు, ఐసీఐడీ, సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులు, సభ్యులు హాజరవుతారని కలెక్టర్ ఎ.మల్లికార్జున వెల్లడించారు.