రేపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈనెల 28వ తేదీన జరుగుతుందని పార్టీ నాయకులు తెలిపారు. రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో రేపల్లె టిడిపి కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ, వార్డు అధ్యక్ష కార్యదర్శులు , బూత్ కన్వీనర్లు తప్పక హాజరు కావాలని టిడిపి నాయకులు కోరారు.