రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుకు తొలి ప్రాధాన్యం ఇస్తామని గుంటూరు ఆర్డీఓ శ్రీకర్ తెలిపారు. ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకుని తొలి పోస్టింగ్ గుంటూరు ఆర్డీఓగా రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ పని నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.