ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాతో సంబంధాలున్న బంగ్లాదేశ్ జాతీయుడిని సూరత్ క్రైమ్ బ్రాంచ్ శుక్రవారం అరెస్టు చేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. నిందితుడిని అబూ బకర్గా గుర్తించారు.నిందితుడి నుంచి నకిలీ ఆధార్ కార్డు, బంగ్లాదేశ్ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ఇంగ్లిష్, బంగ్లాదేశ్ భాషల్లోని జనన ధృవీకరణ పత్రాలు కూడా లభ్యమయ్యాయని, అతని వద్ద రెండు మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు తన పేరు మార్చుకుని 2015 నుంచి అహ్మదాబాద్లో నివసిస్తున్నట్లు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా భారత్కు వచ్చి నకిలీ ఆధార్ కార్డును తయారు చేశాడని పోలీసులు తెలిపారు.