గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద నమోదైన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాఫియా-రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీకి ఘాజీపూర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శుక్రవారం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 5 లక్షల జరిమానా కూడా విధిస్తూ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అరవింద్ కుమార్ తీర్పు చెప్పారు. ముఖ్తార్ అన్సారీ ముఠా సభ్యుడు సోనూ యాదవ్‌కు కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించిందని ఘాజీపూర్ అదనపు జిల్లా ప్రభుత్వ న్యాయవాది నీరజ్ శ్రీవాస్తవ తెలిపారు. ముఖ్తార్ అన్సారీని దోషిగా కోర్టు గురువారం ప్రకటించిందని శ్రీవాస్తవ ఘాజీపూర్‌లో తెలిపారు. మొత్తం ఆరు కేసుల్లో అన్సారీకి శిక్ష పడింది. కరంద పోలీస్ స్టేషన్ పరిధిలోని సువాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కపిల్‌దేవ్ సింగ్‌ను 2009లో ఇద్దరు మోటారు సైకిల్‌పై వచ్చిన దుండగులు హత్య చేశారని శ్రీవాస్తవ తెలిపారు.ఈ కేసులో చందన్ యాదవ్, రాధేశ్యామ్ హరిజన్‌లపై హత్యానేరం నమోదు చేయగా, అన్సారీపై ఐపీసీ సెక్షన్ 120బీ (నేరపూరిత కుట్రకు శిక్ష) కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.