ప్రపంచకప్‌లో భాగంగా నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. అయితే 271 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసి విజయం సాధించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో మార్క్‌రమ్ 91 పరుగులు చేసాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 3, హారిస్ రవూఫ్, వాసిమ్ జూనియర్, వసామా మీర్ 2 చొప్పున వికెట్లు తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa