లైసెన్స్ లేకుండా హైస్పీడ్ వాహనాలతో రేసులు పెట్టుకొని అడ్డదిడ్డంగా నడుపుతున్న ఇద్దరి పై పట్టాభిపురం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. గుజ్జనగుండ్లకు చెందిన రత్నకిరీటి, రెడ్డిపాలెంకు చెందిన మణి బ్రహ్మాచారి పట్టాభిపురం రహదారిలో వాహనాలను ఇష్టం వచ్చినట్లు నడిపారు. నెంబర్ ప్లేట్లు కూడా లేకుండా వాహనాలు వేగంగా నడిపి వాహనచోదకులను భయాందోళనలకు గురి చేసినందుకు ఇద్దరి పై కేసులు నమోదు చేశారు.