ఖమ్మంలో మంత్రి అంబటి రాంబాబుపై దాడికి ప్రయత్నించిన టిడిపి నాయకులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం గుంటూరు పట్టణంలోని లాడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద వైసిపి నాయకులు ధర్నా నిర్వహించారు. ఆలిండియా కాపు అభ్యున్నతి సంఘం ఆధ్వర్యంలో ఖబడ్దార్ తెలుగుదేశం గూండాల్లారా అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.