ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టెక్కలి ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. యూనియన్ డిపో సెక్రటరీ బి. ధనుంజయరావు ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. యూనియన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు చేపట్టిన రిలే దీక్షలు శనివారం కూడా కొనసాగనున్నట్లు ఎన్ఎంయు నాయకులు తెలిపారు.