గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామ సచివాలయంలో శుక్రవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జెసి జి. రాజకుమారి, తెనాలి ఆర్ డి ఓ గీతాంజలి శర్మ, అధికారులు పాల్గొన్నారు. మండలంలోని 13 గ్రామాల పరిధిలోని ప్రజల నుంచి వ్యక్తిగత సమస్యలు, సామాజిక మౌలిక సౌకర్యాలు కల్పన, అభివృద్ధి సంబంధించిన 40 అర్జీలను స్వీకరించారు. త్వరలో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని జేసి రాజకుమారి తెలిపారు.