ప్రత్యేక సారాంశ సవరణ ప్రక్రియలో బాగంగా ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల విషయంలో తప్పులు లేని జాబితా తయారీకి రాజకీయ పార్టీల ప్రతినిధులు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ శివశంకర్ లోతేటి కోరారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్సు హాలులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాఫ్ట్ జాబితా శుక్రవారం విడుదల చేశామని పేర్కొన్నారు.