నెల్లూరు జిల్లా కావలిలో రౌడీమూఖలు బైకు అడ్డంగా ఉండగా హారన్ మోగించారని ఆర్టీసీ డ్రైవర్లపై మూకుమ్మడిగా దాడి చేసి, హత్యాయత్నం చేశారు. జాతీయ రహాదారి నడిరోడ్డులో బస్సును కారుతో అడ్డగించి దాష్టీకం ప్రదర్శించారు. ఆర్డీసీ డ్రైవర్ బీఆర్ సింగ్‌ని రోడ్డుపై పడేసి కాళ్లతో తన్నతూ రౌడీలు రెచ్చిపోయారు. అడ్డొచ్చిన వారిని, వీడియోలు తీయబోయిన వారిపైనా దాడి చేసి.. చంపి పాతిపెడతామంటూ హెచ్చరించారు. ఎవరొస్తారంటూ తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఈ ఘటనలో దేవరకొండ సుధీర్‌తో పాటు పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.