పశ్చిమ మధ్య బంగాళాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సముద్రం మీదుగా కోస్తాపైకి తేమగాలులు వీచాయి. ఇంకా తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.