చంద్రగ్రహణం కారణంగా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువ పల్లిలోని బోయకొండ గంగమ్మ ఆలయం శనివారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ కమిటీ ఛైర్మన్ నాగరాజా రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 6 గంటలకు అమ్మవారి దర్శనం యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆయన కోరారు.