వైసీపీ దొంగ మాటలు చెప్పి, దొంగతనం నుంచి పుట్టిన పార్టీ . ఆ పార్టీ చేస్తున్న బూటకపు బస్సు యాత్రల్లో నేతలను ప్రజలు నిలదీయాలి అని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. పదవులన్నీ తన సామాజికవర్గానికి ఇచ్చుకుని, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలు అంటూ జగన్‌రెడ్డి బూటకపు ఆప్యాయతను ప్రదర్శిస్తున్నాడన్నారు. సీనియారిటీ మేరకు నాలుగో ర్యాంక్‌లో ఉన్న ద్వారకా తిరుమలరావుకు డీజీపీ పోస్ట్ ఇవ్వాల్సి ఉందని, అందుకు భిన్నంగా 16వ ర్యాంక్‌లో ఉన్న రాజేంద్రనాథరెడ్డిని నియమించార న్నారు. చేతకాని వ్యక్తి పాలన చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, జగన్ అస్తవ్యస్త పాలనను గిన్నిస్ బుక్‌లో ఎక్కించదగినదంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు చేస్తున్న బస్సు యాత్రలను ప్రజలు నిలదీయాలన్నారు.