విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలంలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే..... మండలంలోని కాశిందొరవలస పంచాయతీ పరిధిలోని ఎరకందొరవలస గ్రామానికి చెందిన జన్ని మరియమ్మ(29)కు అదే గ్రామానికి చెందిన జన్నిరాజుకు ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతోంది. స్థానిక ఆర్ఎంపీ వైద్యుని వద్ద చికిత్స పొందుతోంది. గురువారం కూలి పనులు చేసు కొని సాయంత్రం ఇంటికొచ్చి, ఒంట్లో నలతగా ఉందని చెప్పి పడుకుంది. తెల్లవారు జామున చూసే సరికి ఆమె విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి సీహెచ్సీకి తరలించి, తండ్రి బడ్నాన చిన్నపుదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరియమ్మ మృతికి గల కారణా లపై ఆరా తీసేందుకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జ్ఞాన ప్రసాద్ తెలిపారు.