ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దుల్లో ప్రమాదకర వైరల్ ఇన్‌ఫెక్షన్ కలవరపెడుతోంది. క్రిమిన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ (సీసీహెచ్ఎఫ్) అనే ఈ వ్యాధి హయలోమా మార్గినాటమ్ అనే పురుగుల కుట్టడం ద్వారా వ్యాపిస్తోంది. ఇది ఎబోలా వైరస్‌ను పోలి ఉంటుంది. ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. బాధితుల్లో కండరాల నొప్పి, గొంతులో మంట, వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. వైరస్ వ్యాప్తి పెరగడంతో బ్రిటన్ అప్రమత్తమైంది.