నేటి నుండి జిల్లా స్థాయిలో టీడీపీ, జనసేన ఉమ్మడి సమావేశాలు జరగనున్నాయని టీడీపీ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కరువు, రైతుల సమస్యలు తదితర సమస్యలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాల పేరుతో జగన్ చేస్తున్న అక్రమాలను గడప గడపకు చేరేలా కార్యాచరణ చేస్తామని పేర్కొన్నారు. రెండు పార్టీల అభిప్రాయాలతో పాటు వివిధ అంశలపై వీరు చర్చించనున్నట్టు వెల్లడించారు.