వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో అత్యధికంగా ఏడు సెంచరీలు నమోదు చేసిన ఘనతను తాజాగా రోహిత్ శర్మ సాధించాడు. అక్టోబరు 11న ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేయడంతో ఈ ఘనత సాధించాడు. దీంతో సచిన్ టెండూల్కర్ ఆరు సెంచరీల రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 556 సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా కూడా ఈ మ్యాచ్‌లో ఘనత సాధించాడు. క్రిస్‌గేల్ 553 సిక్సర్ల రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa