చంద్రబాబు కుడికంటికి కాటరాక్ట్ సర్జరీ చేయాలని స్పష్టం చేశారు వైద్యులు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 25న ప్రభుత్వ వైద్యులు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈక్రమంలో ఆయన కుడి కంటిలో శుక్లం ఉందని, సర్జరీ చేయాలని పేర్కొంటూ ఓ నివేదికను జైలు అధికారులకు సమర్పించారు. ఈ ఏడాది జూన్ లో చంద్రబాబు ఎడమకంటికి సర్జరీ జరగడం గమనార్హం.