తగిన మార్పులు చేసుకుంటే పక్షవాతం బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని నగరంలోని పలువురు ప్రముఖ న్యూరాలజిస్టులు పేర్కొన్నారు. ప్రంపంచ పక్షవాత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ సహకారంతో బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం స్ట్రోక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.