వ్యక్తి పై దాడి చేసి గాయపరిచిన సంఘటనకు సంబంధించి ఇరువురు వ్యక్తులకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి కె నరేంద్రరెడ్డి శనివారం తీర్పు నిచ్చారు. చిలకలూరిపేటకు చెందిన అందుగుల శ్రీకాంత్ పై, దార్ల శ్రీకాంత్, కోడిరెక్క శేషయ్యలు గత సంవత్సరం డిసెంబర్ నెలలో దాడి చేశారు. ఈ నేపథ్యంలో నేరం రుజువు కావడంతో ఇరువురికి న్యాయమూర్తి శిక్ష విధించారు.