వట్టిచెరుకూరు గ్రామానికి చెందిన గేరా సందీప్ (21) శనివారం రాత్రి అదే గ్రామానికి చెందిన చెరుకూరి పరమేశ్వరరావు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో గేరాసందీప్ అక్రమసంబంధం కలిగి ఉన్నాడని శనివారం రాత్రి ఇంటికి వచ్చి ఉరివేసుకొని చనిపోయాడని పరమేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వట్టిచెరుకూరు ఎస్సై కోటేశ్వరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాడు. మృతుడు మెకానిక్ పనిచేస్తాడని తెలిసింది.